అక్క కోసం తమ్ముడి కిడ్నాప్: యూపీలో మరో దారుణం

24-07-2014 Thu 10:58
ఓ యువతి కోసం ఆమె తమ్ముడిని అపహరించాడో దుర్మార్గుడు. దాదాపు తొమ్మిది రోజులుగా 14 ఏళ్ల ఆ కుర్రాడిని పలు ప్రాంతాలకు తిప్పుతూ, బాధిత కుటుంబ సభ్యులను తీవ్ర వేదనలోకి నెట్టేసిన ఆ దుండగుడు, పోలీసులకూ సవాల్ విసిరేలా వ్యవహరిస్తున్నాడు. ఈ నెల 16న బాలుడు కిడ్నాప్ కాగా, అతడి తల్లిదండ్రులు శక్తి మేర వెదికి చివరకు దుర్మార్గుడి ఫోన్ కాల్ తో పోలీసులను ఆశ్రయించారు. అయినా ఆ కుటుంబానికి ఉపశమనం లభించకపోగా, దినదినగండంగా మారింది. యువత విచిత్ర మనస్తత్వానికి తార్కాణంగా నిలుస్తున్న ఈ ఘటన కూడా మానవ మృగాల అకృత్యాలు నిత్యం వెలుగు చూస్తున్న ఉత్తర ప్రదేశ్ లోనే చోటుచేసుకుంది. అపహరించిన బాలుడిని వదిలిపెట్టాలంటే, అతడి అక్కను తన వద్దకు పంపమన్న కిడ్నాపర్ డిమాండుకు ఎలా స్పందించాలో కూడా బాలుడి తల్లిదండ్రులకు తెలియడం లేదు. కొడుకు కావాలా? కూతురు కావాలా? అంటే ఆ తల్లిదండ్రుల నుంచి మాత్రం ఏం సమాధానం వస్తుంది, మూగ వేదన తప్ప! ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ సమీపంలోని బరౌన్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల అజయ్ అనే బాలుడు ఈ నెల 16న అదృశ్యమయ్యాడు. కొడుకు కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు తెలిసిన ప్రతి చోటా వెదికారు. అయితే బాలుడు కనిపించలేదు. ఇలా వెదుకుతున్న క్రమంలో రాహుల్ అనే యువకుడు ఆ కుటుంబానికి ఫోన్ చేశాడు. "మీ కొడుకు మీకు కావాలంటే, మీ కూతురును నా వద్దకు పంపండి" అంటూ షరతు పెట్టాడు. "గ్రామానికి సమీపంలోని బాధ్ పూర్ ఆలయం వద్ద మీ కూతురును నాకప్పగించి, మీ కొడుకును తీసుకుపోండి" అని చెప్పాడు. దీంతో, ఏం చెప్పాలో తెలియని బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల సూచన మేరకు యువతితో బాధ్ పూర్ ఆలయం వద్దకెళ్లగా నిందితుడు కనిపించలేదు. అక్కడినుంచి ఇంటికి తిరిగివచ్చిన బాలుడి తండ్రికి తిరిగి ఫోన్ చేసిన కిడ్నాపర్, "పోలీసులను ఆశ్రయిస్తే, మీ కొడుకు మీకు దక్కడు" అంటూ బెదిరించాడు. దీంతో ఇక లాభం లేదనుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. ఎవడో భగ్న ప్రేమికుడి దుశ్చర్యగా భావిస్తున్న పోలీసులు ఆరుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రాంతాలు మారుతూ నిందితుడు చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడని చెప్పిన పోలీసులు, త్వరలోనే నిందితుడికి బేడీలు వేస్తామని చెప్పారు.

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more